Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి అనంతరం రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఇక ఈ ఎన్నికలలో భాగంగా పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన ఈయన త్వరలోనే ఏపీ అసెంబ్లీలో మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారు. ఇలా కూటమి భారీ మెజారిటీతో గెలవడంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ కూడా తన ఫ్యామిలీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. తన భార్య అన్నా లెజీనోవాతో పార్టీ తన కుమారుడు అకీరా నందన్ కూడా ప్రధానమంత్రిని కలిశారు. ఈ క్రమంలోనే అకీరా మోడీకి బొకే అందించి ఆయనకు నమస్కారం చేశారు.
అనంతరం పవన్ కళ్యాణ్ తన కొడుకును పరిచయం చేయడంతో మోడీ తన గురించి ఏదో మాట్లాడగా అన్నా, పవన్ నవ్వుకున్నారు. బహుశా ఆయన హైట్ చూసి మోడీ ఆశ్చర్య పోయి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మోడీతో అకీరా…
ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే అకీరాను పీఎంకి పరిచయం చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగారని ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అయితే ఈయన ఏ మంత్రి పదవి ఆశిస్తున్నారు, ఈయనకు ఏ మంత్రి పదవి ఇస్తున్నారనేది తెలియాల్సిందే.



























