Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలోనూ మరో వైపు సినిమాలలోని ఎంతో బ్యాలెన్స్ గా శ్రమిస్తున్నారు. ఇక మార్చి 24 వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నేతాజీ గ్రంథ సమీక్ష కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్వాతంత్ర సమరయోధుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలు టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే నేతాజీ అస్థికలను ఇండియాకు తీసుకొచ్చి ఎర్రకోటలో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పటివరకు భారత దేశంలో ఎంతోమంది పాలకులు మారుతున్న ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా నేతాజీ అస్తికలను ఇండియాకు తీసుకురాలేక పోతున్నారు. అసలు ఒక స్వాతంత్ర సమరయోధుడుకి సంబంధించిన అస్తికలను ఎందుకు ఇండియాకు తీసుకురాలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.
నిన్నగాక మొన్న వచ్చిన ఎంతో మంది నాయకుల శిలాఫలకాలు విగ్రహాలు ఇండియాలో ఉన్నప్పుడు దేశం కోసం స్వాతంత్ర సమర పోరాటంలో ఎంతో కృషి చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలను ఇండియాకు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.రింకోజ్ టు రెడ్ ఫోర్ట్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ఆవిష్కరించి నేతాజీ సేవలను ఈ దేశం గుర్తించలేదని తెలియజేశారు.
ప్రజలు తలుచుకుంటే సాధ్యమవుతుంది….
రెంకోజీ ఆలయంలోని విజిటర్స్ పుస్తకంలో ఎప్పటికైనా ఏదో ఒక రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలను ఇండియాకు తీసుకువస్తామని అప్పటి ప్రధానమంత్రి వాజ్ పాయ్ అందులో రాసినట్టు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. నేతాజీ చనిపోయి 77 సంవత్సరాలు అయినప్పటికీ ఆయనకు డీఎన్ఏ టెస్ట్ చేసి ఎందుకు అస్తికలను ఇండియాకు తీసుకురాలేక పోతున్నారు అంటూ ప్రశ్నించారు . ప్రజలు తలుచుకుంటే ఇది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు.
































