Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా కూడా తనదైన ముద్ర వేయించుకున్నారు. ఒకవైపు రాష్ట్ర రాజకీయాలను అలాగే సినిమాలలో దూసుకుపోతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈయనకు సినిమాల పరంగా రాజకీయ పరంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఎవరైనా ఒక్క మాట మాట్లాడిన సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఏ స్థాయిలో రెచ్చిపోయి కామెంట్లు చేస్తారో మనకు తెలుస్తుంది.

ఇకపోతే హీరో రాజా అప్పట్లో వైయస్సార్ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ఇకపోతే రాజకీయపార్టీలో ఉన్న రాజా రాజకీయాల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివితే నీకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయి అంటూ అతని పై కామెంట్ చేశారు.ఇలా పవన్ కళ్యాణ్ ను అనడంతో ఒక్క సారిగా పవన్ అభిమానులు రెచ్చిపోయి తన తల్లి భార్య కూతురుని దారుణంగా అసభ్యకరమైన కామెంట్ చేస్తూ దూషించారు.

ఇకపోతే ప్రస్తుతం రాజా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ దేవుడు సువార్తలు చెబుతూ ఉన్నారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన కామెంట్ల గురించి ప్రస్తావించారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చాలా మంచివారు. ఆయన తనలో ఉన్న ఎమోషన్స్ ఆపుకోలేరు. నేను అతనితో కలిసి పని చేశాను ఆయన ఎలాంటి వ్యక్తి అనే విషయం నాకు తెలుసు.కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన గురించి ప్రస్తావించాల్సి వచ్చింది.

పవన్ కళ్యాణ్ కి సంబంధం లేదు…
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా ఎంతో ముందుకు వెళ్లాలని ఎన్నో పథకాలు రచించారు. అయితే ఆయన రాజకీయాలకు అభిమానులే అడ్డుగా మారారు. అభిమానులు ఇలాంటి కామెంట్లు చేయడం అందరిపై దూషించడం వల్ల ఆయన రాజకీయ ప్రస్థానానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.వారు తెలుసుకొని ఇలాంటివి మానుకుంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని ఈ సందర్భంగా రాజా మాట్లాడారు. అయితే అభిమానులు చేసిన ఈ కామెంట్ లకు పవన్ కళ్యాణ్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు.అతని ఫ్యాన్స్ అలా చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందులు ఎదురవుతాయని రాజా వెల్లడించారు.






























