Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం ఆపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నీ చూసుకుంటున్న సంగతి మాకు తెలిసిందే .ఈమె అపోలో హాస్పిటల్స్ ద్వారా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయ సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు అయితే తాజాగా అపోలో హాస్పిటల్ కొత్త బ్రాంచ్ పిఠాపురంలో ప్రారంభించబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గెలవడంతో పిఠాపురం తలరాత కూడా పూర్తిగా మారిపోయింది ఇప్పటికే అక్కడ భూములు భారీ ధరలకు అమ్ముడుపోతున్నాయి.
ఈ క్రమంలోనే తన మామయ్య గెలిచిన ప్రాంతంలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం అపోలో హాస్పిటల్ నిర్మించాలని భావించినట్టు సమాచారం. హాస్పిటల్ కోసం రాంచరణ్ ఇప్పటికే ఇక్కడ చరణ్ 10 ఎకరాలు స్థలం కూడా కొనుగోలు చేశారని తెలుస్తోంది.
అపోలోహాస్పిటల్స్…
ఈ విధంగా రామ్ చరణ్ ఉపాసన నిర్ణయంతో పిఠాపురం ప్రజలకు ఎంతో మెరుగైన వైద్య సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చే పనులలో బిజీగా ఉన్నారు.



























