Pawan Kalyan: వారి మాటలకు నా భార్య కన్నీళ్లు పెట్టుకుంటుంది… పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్!

0
145

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు వారాహి రెండవ దశ యాత్ర కూడా మొదలుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన పలు ప్రాంతాలలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న క్రమంలోనే వాలంటీర్లను టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

e,

ఇలా వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా భగ్గుమన్నటువంటి వాలంటీర్లు అలాగే వైయస్ఆర్సీపీ నేతలు మీడియా సమావేశాలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించడమే కాకుండా ఆయనకు తమ స్టైల్ లో సమాధానం చెబుతున్నారు.

వైఎస్ఆర్సిపి నేతలు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాల గురించి కూడా విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి నేతలు తన భార్య గురించి మాట్లాడటంతో ఆమె ఏడుస్తుంది అంటూ కామెంట్ చేశారు. తన భార్య ఏడుస్తుందంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: త్వరలోనే విడుదల కానున్న బ్రో…


ఇకపోతే పవన్ కళ్యాణ్ ఒకవైపు వారాహి యాత్రలో బిజీగా ఉంటూనే మరోవైపు పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ఈనెల 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అలాగే సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.