Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో పవన్ వర్సెస్ బన్నీ అనే విధంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కూడా మెగా అభిమానులు అలాగే అల్లు అభిమానుల మధ్య కూడా గత కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతుంది. ఇలాంటి తరుణంలోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు అంటూ బన్నీ ఫాన్స్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారని పవన్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా మహారాష్ట్రలో ఎన్నికలు జరగగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడంతో అక్కడ భారీ మెజార్టీ లభించిందని జాతీయస్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ పేరు మారుమోగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్న తరుణంలో పవన్ పరువును బన్నీ అభిమానులు తీసేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు జాతీయ స్థాయిలో రాజకీయాల పరంగా పెద్దగా పవర్ ఏమి లేదని కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ జాతీయస్థాయిలో ఈయన మంచి నాయకుడై ఉండి ఈయన వల్లే మహారాష్ట్రలో భారీ మెజార్టీ వచ్చింది అనుకుంటే మరి ఎందుకు తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవలేదని బన్నీ ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కూడా ఈయన బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేశారు.

Pawan Kalyan: తెలంగాణలో ఎందుకు గెలవలేదు..
పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేసిన ఎందుకు గెలవలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా బన్నీ అభిమానులు అడిగే ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ అభిమానుల వద్ద సమాధానం లేదనే చెప్పాలి. ఇలా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అలాగే బన్నీ అభిమానుల మధ్య మరోసారి సోషల్ మీడియా వార్ జరుగుతుంది.
































