Pawan Kalyan: మహారాష్ట్రలో ఇటీవల ఎన్నికల ఫలితాలు విడుదల కాగా బీజేపీ అధిక శాతం స్థానాలను కైవసం చేసుకుని మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఇలా మహారాష్ట్రలో మహాయుతికూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే కాకుండా ఈ ఫలితాలు ఇలాగే ఉండబోతాయని ఎగ్జిట్ పోల్ కేకే సర్వే వెల్లడించింది.

ఇలా కేకే సర్వే వెల్లడించిన ఫలితాలకు దగ్గరగానే మహారాష్ట్ర ఫలితాలు రావడంతో మరోసారి కిరణ్ కొండేటి దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఈ క్రమంలోనే ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
మహారాష్ట్రలో బిజెపి అధికారంలోకి వచ్చింది అంటే ఆ ఎన్నికలపై పవన్ ప్రభావం చాలా వరకు చూపించిందని కిరణ్ కొండేటి తెలిపారు.బల్లార్‌పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్‌పూర్, కస్బాపేట్, డెగ్లూర్, లాతూర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయగా ఈ ప్రాంతాలలో ఎక్కువగా బిజెపి నేతలు గెలిచారు. ముఖ్యంగా పవన్ తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పర్యటించారని తెలిపారు.

Pawan Kalyan: ఆకర్షణ ఉన్న నాయకుడు…
పవన్ కళ్యాణ్ కారణంగా మహారాష్ట్రలో బిజెపికి రెండు శాతం ఓట్ షేరింగ్ పెరిగిందని,బీజేపీకి ఇన్నాళ్లకు బలమైన, ప్రజా ఆకర్షణ ఉన్న పవన్ కల్యాణ్ దొరికాడని తెలిపారు. భవిష్యత్ లో బీజేపీకి పవన్ కల్యాణ్ బలమైన మిత్రుడిగా ఎదిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
































