Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టారు. ఇలా రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉన్నటువంటి ఈయన తరచూ అధికారపక్ష నేతలు తన గురించి మాట్లాడే వ్యాఖ్యలను తిప్పి కొడుతూ తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 10 సంవత్సరాల పూర్తి చేసుకోవడంతో మచిలీపట్నంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ గురించి ఓపెన్ అవుతూ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ తన రెమ్యూనరేషన్ గురించి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తను ప్యాకేజీ తీసుకున్నారంటూ అధికార పక్ష నేతలు మాట్లాడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్ తాను సినిమాలలో నటిస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నానని తను చూడని డబ్బు అంటూ లేదని తెలిపారు.

Pawan Kalyan: రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్…
తాను ఒక సినిమాకు 45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం తాను ఒక సినిమా చేస్తున్నానని ఇందులో తాను 22 రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొంటారని అయితే ఒక్కరోజుకు రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని ఈ సందర్భంగా పవన్ తన తాజా రెమ్యూనరేషన్ పై ఓపెన్ అవుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా పవన్ రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలియడంతో అభిమానుల సైతం ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.



































