Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు హీరోగా సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయ నాయకుడిగా రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు.ఈయన గత తొమ్మిది సంవత్సరాలుగా తన జనసేన పార్టీని స్థాపించి పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇలా ఒక పార్టీని ఇన్ని సంవత్సరాలుగా ముందుకు నడిపించాలంటే ఎంతో డబ్బు అవసరం అవుతుంది.

పవన్ కళ్యాణ్ వద్ద పార్టీని నడిపించే స్తోమత ఉందని చాలామంది భావిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పవన్ సోదరుడు నాగబాబు పవన్ కళ్యాణ్ ఆస్తిపాస్తుల గురించి అన్ని విషయాలు బయట పెట్టారు. ఈ సందర్భంగా పవన్ ఆస్తుల గురించి నాగబాబు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ఆస్తుపాస్తులు లేవని తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తేనే ఆయనకు డబ్బులు వస్తాయని, డబ్బు కావాలంటే సినిమాలు చేయాల్సిందేనని తెలిపారు. అందరి మాదిరిగా ఆయనకు ఇతర వ్యాపారాలు లేవని నాగబాబు వెల్లడించారు.సినిమా చేసిన తర్వాత వచ్చే డబ్బులో తన అవసరాలకు కొంత ఉంచుకొని మిగిలినది మొత్తం ప్రజల అవసరాలకు ఉపయోగిస్తూ ఉంటారని నాగబాబు తెలియజేశారు.

Pawan Kalyan: అప్పు చేసి ఇన్కమ్ టాక్స్ కట్టారు…
మరి పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే ఆస్తులు లేవా అని యాంకర్ అడగడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కుంటున్నటువంటి ఇల్లు ఫైనాన్స్ లో ఉంది అలాగే ఈయనకు 15ఎకరాల పొలం ఉంది. అది వ్యవసాయం చేయాలన్న ఉత్సాహంతో కొనుగోలు చేశారని నాగబాబు తెలిపారు. ఇది తప్ప పవన్ కి ఎలాంటి ఆస్తులు లేవు ఇక ఇన్కమ్ టాక్స్ కట్టడానికి కూడా అప్పు చేసి ఇన్కమ్ టాక్స్ చెల్లించాడంటూ ఈ సందర్భంగా నాగబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






























