Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి క్రేజ్ ఏంటో మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే ఈయన వచ్చే సార్వత్రిక ఎన్నికలను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ గురించి నటి లయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి లయ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన రావడంతో యాంకర్ పవన్ సీఎం అవడం గురించి ప్రశ్నించారు.
ఈ సందర్భంగా లయ సమాధానం చెబుతూ తనకు రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ లో ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయని అయితే ఆయననీ ముఖ్యమంత్రినీ చేయాలా వద్దా అనేది ప్రజలే డిసైడ్ చేస్తారని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ కుర్చీకే ఓ కల వస్తుందని లయ తెలిపారు.

Pawan Kalyan: పవన్ ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటారు…
ఇక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా కాకపోయినా ఆయన ఎప్పుడు టాప్ పొజిషన్ లోనే ఉంటారంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ గురించి నటి లయ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక లయ చేసిన ఈ కామెంట్స్ పై మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
































