Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో భాగంగా ఈయన వైసిపి మంత్రులను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రోజా గురించి ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో రోజా మెగా బ్రదర్స్ ప్రజలకు సహాయం చేయకపోవడం వల్లే సొంత జిల్లాలలో కూడా ఓడిపోయారంటూ కామెంట్లు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ యువ శక్తి కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ రోజాకు కౌంటర్ ఇచ్చారు. తాను ఒంటరిగానైనా పోరాడే శక్తి తనకు ఉం.ది అయితే తనకు గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే పొత్తు పెట్టుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని లేకపోతే ఒంటరిగానైనా పోరాడటానికి తాను ఏ మాత్రం వెనకాడనని పవన్ కళ్యాణ్ తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న గుండాలు రౌడీలను ఎలా తన్నాలో తనకు బాగా తెలుసని రెండు ముక్కలైన ఈ రాష్ట్రాన్ని మరో మూడు ముక్కలు చేయాలనే కుట్రలు ప్రయత్నాలను ఆపుతానని పవన్ తెలిపారు.ఇక రోజా గురించి ప్రస్తావిస్తూ ఆమెను డైమండ్ రాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా చివరికి ఆ రోజాతో కూడా మాటలు పడాల్సి వస్తుంది.ఛీ నా బతుకు చెడ అంటూ పవన్ కళ్యాణ్ రోజాపై కామెంట్లు చేశారు.

Pawan Kalyan: ఎదవలు సన్నాసులతో కూడా తిట్టించుకోవాల్సి వస్తుంది…
ప్రజల కోసం ఇలాంటి డైమండ్ రాణిలతో కూడా తిట్టించుకోవాల్సి వస్తుందని ఈయన వెల్లడించారు.గత కొన్ని సంవత్సరాల నుంచి ఎదవలు సన్నాసులతో కూడా తాను తిట్టించుకోవలసి వస్తుందని అయితే సాటి మనుషుల కోసం జీవించడం గొప్ప విషయంగా భావిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.





























