Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో చురుగ్గా ఉంటున్నారు. ఈయన గత సంవత్సర కాలంగా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇక ఏపీలో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా కూటమి ఒకవైపు వైసీపీ ఒక వైపు హోరాహోరీగా పోటీలో నిలిచాయి అయితే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ కూటమి తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

ఇలా ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలుస్తారని ధీమా అందరిలోనూ ఉంది. ఇలా ఎన్నికలు పూర్తి కావడంతో ఈయన తన భార్య అన్నా లెజినోవాతో కలిసి కాశి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ సతి సమేతంగా వీరిద్దరూ కాశీ విశ్వేశ్వరుడికి పూజలు చేసి అనంతరం ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే తన భార్యకు ఓటు హక్కు లేకపోయినా తనని కూడా వెంట తీసుకువచ్చారు. అలాగే పిఠాపురంలో కూడా వీరిద్దరు పర్యటించారు. ఇలా ఓటు హక్కు లేకపోయినా పవన్ కళ్యాణ్ తన భార్యను వెంటబెట్టుకుని తిరగడం వల్ల కారణం ఏంటి అలాగే ఎప్పుడు లేనిది ఆలయాలకు వెళ్లి పూజలు చేయడం ఏంటి అనే విషయంపై చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
విడాకుల వార్తలకు చెక్…
ఇలా తన భార్యతో కలిసి బయట కనిపించడం వెనుక కారణం లేకపోలేదని తెలుస్తుంది. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకి కూడా విడాకులు ఇచ్చారని ఆమె కొంత మొత్తంలో డబ్బు తీసుకొని రష్యా వెళ్ళిపోయారు అంటూ వార్తలు వచ్చాయి. ఇలా మూడో భార్య విడాకులు ఇవ్వడంతోనే పవన్ నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఆ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి బయటకు కనిపిస్తున్నారని తెలుస్తోంది.



























