టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో మెగా హీరోలు ముందుంటారు. మెగా హీరోలకు ఏ విధమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా హీరోలు పలు సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే మెగా కాంపౌండ్ నుంచి ఓ లేటెస్ట్ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో మెగా హీరో నటించిన స్నేహం కోసం, అందరివాడు, బందిపోటు,బిల్లా రంగా వంటి సినిమాలలో తండ్రీ కొడుకుల పాత్రల్లో చిరంజీవి ద్విపాత్రాభినయంలో ఎంతో అద్భుతంగా నటించారు. అయితే ప్రస్తుతం చిరంజీవి బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్, కొడుకు రామ్ చరణ్ చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు మనకు తెలిసిందే. పవన్ కెరీర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మొట్టమొదటి సారిగా ద్విపాత్రాభినయంలో తండ్రీకొడుకుల పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా తరహాలో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకుల పాత్రల్లో రామ్ చరణ్ నటిస్తున్నట్లు మనకు తెలిసిందే. అయితే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ,రామ్ చరణ్ చిరు బాటలో ద్విపాత్రాభినయంలో చేయనున్నారని తెలియడంతో మెగా అభిమానులు మాత్రం తెగ సంబర పడిపోతున్నారు

































