Preeti Jhangiani: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ముంబై ముద్దుగుమ్మ ప్రీతి జింగానియా.ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాకముందు మలయాళం తమిళ సినిమాలలో నటించినప్పటికీ ఈమెకి తమ్ముడు సినిమా మాత్రం పెద్ద హిట్ అందించింది.ఇలా తమ్ముడు సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ప్రీతి జింగానియా అనంతరం తెలుగులో పలు సినిమాలలో నటించారు.

ఈ విధంగా పలు తెలుగు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ పూర్తిగా తెలుగు తెరకు దూరమయ్యారు. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు ఈమె దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రీతి జింగానియా కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.
ఇలా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ ఏమాత్రం చెరగని అందంతో హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఫోటోలు దిగారు. బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో సాగరకన్యలా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇలా హాట్ ఫోటోషూట్ తో కుర్రకారులకు ఈ ఫోటోలు చెమటలు పట్టిస్తున్నాయని చెప్పాలి.

Preeti Jhangiani: సాగర కన్యలా ప్రీతి జింగానియా..
ఈ క్రమంలోనే ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది అభిమానులు పెద్ద ఎత్తున ఈమె అందంపై ప్రశంశలు కురిపించడమే కాకుండా ఇప్పటికీ ఈమెతో పాటు కలిసిన నటించిన ఎంతోమంది నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మీరు కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి ప్రీతి జింగానియా ప్రేక్షకుల కోరిక మేరకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.