Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ క్యాబినెట్లో మంత్రిగా చోటు సంపాదించుకున్నారు. ఈయన ఉప ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా నియమితులైన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈయన తన ఛాంబర్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రితో పాటు పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఈయన మొదటి రెండు సంతకాలు కీలక ఫైళ్ళ పై చేశారని తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ చేసిన ఆ సంతకాలు ఏ ఫైల్ మీద చేశారు ఏంటి అనే విషయానికి వస్తే..
వేద పండితుల ఆశీర్వాదం తర్వాత ఈయన మంత్రి సీట్లో కూర్చుని పలు ఫైలను పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించి నిధుల మంజూరపై మొదటి సంతకం చేశారు. ఇక రెండో సంతకం గిరిజన గ్రామాలలో పంచాయతీ భవనాలు నిర్మాణంపై రెండో సంతకం చేశారు.
మంత్రిగా పవన్..
ఈ విధంగా పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.





























