Pawan Kalyan: ఎస్ ఆర్ కళ్యాణమండపం డైరెక్టర్ శ్రీధర్ గాదే దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నటించినటువంటి తాజా చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ క్రమంలోనే చిత్ర బృందంతో కలిసి పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అన్ని కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉన్నాయని అర్థమవుతుంది. ఇకపోతే ఇందులో కిరణ్ అబ్బవరం క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నారు.కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రముఖ డైరెక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డి సందడి చేస్తున్నారు.

Pawan Kalyan: ఆకట్టుకుంటున్న ట్రైలర్ వీడియో…
కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నటి సంజన ఆనంద్ హీరోయిన్ గా నటించారు.ఇప్పటికే పలు సినిమాలలో నటించి సందడి చేస్తున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎలా సందడి చేయనున్నారో తెలియాల్సి ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ట్రైలర్ లాంచ్ చేయడంతో ఈ ట్రైలర్ వీడియో వైరల్ అవుతుంది.































