Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నేడు సెక్రటేరియట్ లో మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఈయన ఉప ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా దాదాపు 5 శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన రెండు కీలక ఫైళ్ళపై సంతకాలు చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫైళ్లపై సంతకాలను తన వదిన సురేఖ ఇచ్చిన పెన్నుతో చేస్తారని అందరూ భావించినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం తన వదిన ఇచ్చిన పెన్నుతో సంతకాలు చేయకపోవడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారని తెలిసి తన వదిన సురేఖ ఏకంగా మూడున్నర లక్షల విలువ చేసే పెన్ను బహుమతిగా అందచేసిన సంగతి తెలిసిందే.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈయన మంత్రిగా తన మొదటి సంతకం ఈ పెన్నుతో చేస్తారని అభిమానులందరూ భావించారు.
పది రూపాయల పెన్..
ఇక నేడు సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన వదిన ఇచ్చిన లక్షల విలువ చేసే పెన్నుతో కాకుండా కేవలం పది రూపాయల పెన్నుతో సంతకాలు చేసి తన సింప్లిసిటీని ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





























