Pawan Kalyan: వదిన నా విషయంలో చాలా ద్రోహం చేశారు… అందుకే నేను ఇక్కడ ఉన్నాను: పవన్ కళ్యాణ్

0
57

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సుదీర్ఘమైన స్పీచ్ తో అందరిని ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన వదిన సురేఖ చేసినటువంటి ద్రోహమే కారణం అంటూ ఈయన తన వదిన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తనకు సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు.

నాకు ఇష్టం లేనటువంటి ఈ రంగంలోకి నన్ను బలవంతంగా వదిన తీసుకోవచ్చారు. నేను ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకోవడం, పొలం పనులు చూసుకోవాలని అనుకున్నాను. కానీ అన్నయ్య సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న సమయంలోనే నువ్వు కూడా హీరో అవుతావా అంటూ నన్ను ప్రశ్నించారు అయితే ఒక్కసారిగా తనకు భయం వేసిందని తెలిపారు.

నాకు ఇష్టం లేకపోయినా నాపై నమ్మకంతో వదిన నన్ను సినిమా ఇండస్ట్రీలోకి ప్రోత్సహించారు.ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన తాను నేడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు గల కారణం వదిన చేసిన ఆ తప్పేనని ఆమె చేసిన ద్రోహం కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానట్టు సరదాగా తన వదిన సురేఖ గురించి కళ్యాణ్ కామెంట్స్ చేశారు. అయితే హీరో అయిన తర్వాత ఓసారి జగదాంబ థియేటర్ వద్ద బస్సులో డాన్స్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

Pawan Kalyan: వదిన కారణంగానే ఈ స్థాయిలో ఉన్నాను…


ఇలా బస్సులో డాన్స్ చేయడం కోసం తాను చాలా కష్టపడ్డాను ఆ క్షణం వదినకు ఫోన్ చేసి నీవల్లే నేను ఇబ్బంది పడుతున్నాను.ఎందుకు మీరు ఇలా చేశారని వదినను నిలదీశాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖ గురించి కామెంట్స్ చేశారు. అయితే ఇవన్నీ కూడా ఆయన సరదాగా మాట్లాడారు తన వదిన ప్రోత్సహించడంతోనే తాను సినిమా ఇండస్ట్రీలో ఇంత మంచి సక్సెస్ సాధించి మీ ముందు నిలబడ్డానని ఈయన తెలిపారు.