Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి మొదటిసారి అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఏపీలో 21 ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అన్నిచోట్ల భారీ విజయంతో గెలిచారు. ఇక విజయం అనంతరం ఇతర కార్యకలాపాలలో బిజీగా ఉన్నటువంటి ఈయన మొదటిసారి తన భార్య అన్నా, కొడుకు అకీరాతో కలిసి తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు.

ఇక చిరంజీవి ఇంటికి వెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ కు మెగా కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున ఆయనపై పువ్వులు వర్షం వేస్తూ స్వాగతం పలికారు. ఇక చిరంజీవి ఇంటికి చేరుకోగానే మెగా చెల్లెళ్లు, సురేఖ, నాగబాబు భార్య, వారందరికీ హారతులు పట్టి వెల్కమ్ చెప్పారు..
అడుగడుగునా నీరాజనం..
ఇక చిరంజీవిని చూడగానే పవన్ కళ్యాణ్ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. అనంతరం తన తల్లి అంజనమ్మ తన వదిన సురేఖకి కూడా పాదాభివందనం చేసే ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం అందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఎన్నో అవమానాల తర్వాత పవన్ కళ్యాణ్ అందుకున్న ఈ విజయంపై మెగా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.





























