Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించారు అయితే ఈ ఎన్నికలలో మాత్రం జనసేన పార్టీ సునామీ సృష్టించిందని చెప్పాలి. 21 స్థానాలలో పోటీ చేయగా 21 స్థానాలలో అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది.

ఇలా ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గురించి తాజాగా ఆయన కరాటే మాస్టర్ షెహాని హుస్సేన్ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.చెన్నై బేసెడ్ మార్షిల్ ఆర్ట్స్ ఎక్సపర్ట్ షెహాని హుస్సేన్ అనేక సినిమాలు కూడా చేసారు. ఆయన తనే పవన్ కు కరాటే నేర్పానని గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా 1990లో జరిగిందని తెలిపారు..
1990లో నేను కరాటే నేర్పటం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడపటంలో బిజీగా ఉండేవాడిని. కానీ పవన్ కళ్యాణ్ దాదాపు నెల పాటు నా దగ్గరకు రోజూ వచ్చి కరాటే నేర్పమని అడిగేవారు కానీ నాకు ఏజెన్సీ పనులలో బిజీగా ఉండటం వల్ల నేర్పించనని చెప్పినప్పటికీ ఆయన మీ దగ్గర నేర్చుకుంటానని పట్టు పట్టి నా దగ్గర ఉన్నారు.
రూమ్ క్లీన్ చేసేవాడు..
పవన్ కళ్యాణ్ ఓ సామాన్యమైన వ్యక్తిలాగ టీ తెచ్చి పెట్టి మాకు ఇచ్చేవారు. నేను అతని ట్యూటర్ గా చాలా గౌరవంగా చూసి ఏ పని పడితే అది చేసేవారు. కొన్నిసార్లు మా రూమ్ క్లీన్ చేసేవారు. నేను ఏ పని చెబితే అది చేసేవారు సుమారు ఏడాది పాటు మా దగ్గరే ఉన్నారు అంటూ తాజాగా కరాటే మాస్టర్ పవన్ గొప్పతనం గురించి చెబుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.



























