సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న రజినీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రజినీకాంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ అభిమానం, రజినీకాంత్ హృద్యమైన రిప్లై
పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతాలో రజినీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. “బిగ్ స్క్రీన్ పై రజినీ పేరు వినిపించగానే థియేటర్ మొత్తం మారుమోగిపోతుంది. తరాలు మారినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంతటి అభిమానాన్ని అందుకున్న రజినీకాంత్ సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప విషయం” అంటూ ఆయన రాసుకొచ్చారు.
స్వర్ణోత్సవ సూపర్ స్టార్ శ్రీ @rajinikanth గారికి శుభాకాంక్షలు
— JanaSena Party (@JanaSenaParty) August 16, 2025
వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజిని’ అని టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మారుమోగుతుందో పలుమార్లు చెన్నైలో చూశాను. తరాలు మారుతున్నా సినీ ప్రియుల్లో ఆ ఆనందోత్సాహాల వన్నె తగ్గలేదు. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న…
పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు రజినీకాంత్ కూడా అదే తరహాలో స్పందించారు. “ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నా ప్రియమైన మిత్రుడు, పొలిటికల్ తుఫాన్ పవన్ కళ్యాణ్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను” అంటూ హృద్యంగా బదులిచ్చారు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఈ ట్వీట్స్ మార్పిడి అభిమానులను, సినీ ప్రపంచాన్ని మరింత ఉత్సాహపరిచింది.
Deeply honored and overwhelmed by your kind wishes, respected Deputy Chief Minister of Andhra Pradesh, my dear brother and political Thoofan @PawanKalyan garu
— Rajinikanth (@rajinikanth) August 17, 2025
Thank you from the bottom of my heart. God bless. 🙏 @APDeputyCMO






























