Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, మంత్రి పవన్ కళ్యాణ్ కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అనే సంగతి మనకు తెలిసిందే. ఈయన తరచూ ఆలయాలకు వెళ్లడమే కాకుండా ఎన్నో రకాల పూజలు హోమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు.

ఈ విధంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారాహి అమ్మవారి దీక్ష వేసిన సంగతి మనకు తెలిసిందే. 11 రోజులపాటు ఈ దీక్షలో ఈయన ఎంతో నియమ నిష్టలను పాటిస్తూ ఈ దీక్షను పూర్తి చేశారు. ఇక ఈయన దీక్ష నేటితో పూర్తి కావడంతో దీక్ష విరమణ చేశారు.
వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ పవన్ కళ్యాణ్వా రాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏక హారతితో పాటు నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరిగా హారతితో వారాహి ఏకాదశ దిన ఆరాధన సంపూర్ణం అయ్యింది.
వారాహి అమ్మవారు..
ఇలా 11 రోజులపాటు ఈ దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎంతో విజయవంతంగా ఈ దీక్షను పూర్తి చేశారు. ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా కేవలం పండ్లు ద్రవాలను మాత్రమే తీసుకుంటూ ఈ 11 రోజులపాటు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఈయన దీక్షలో ఉన్నారు ఇక నేటితో ఈ దీక్ష పూర్తి అయ్యింది.



























