కాకినాడ జిల్లా: పెద్దాపురం వ్యభిచారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, ఈ కేసులో బాధితురాలిగా కనిపించిన ఓ మహిళ గళమెత్తి, తనను భారతి అనే మహిళ బలవంతంగా వ్యభిచారంలోకి దించి, బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజించిందని తీవ్ర ఆరోపణలు చేసింది.

బాధితురాలి ఆరోపణలు: బలవంతపు వ్యభిచారం, బెదిరింపులు
బాధితురాలు విడుదల చేసిన వీడియోలో చేసిన ఆరోపణల ప్రకారం – భారతి తనను బంధించి వ్యభిచారం చేయించిందని, గర్భం దాల్చిన తర్వాత కూడా తనపై అదే పని కొనసాగించిందని తెలిపింది. పైగా, తాను పారిపోవాలని చూస్తే బిడ్డతో కలిసి చంపుతానంటూ బెదిరించిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ప్రాణహాని ఉందని, కుటుంబ సభ్యులు కూడా అంగీకరించక ఇంటికి రానివ్వడం లేదని వాపోయింది.
భారతి కౌంటర్ ఆరోపణలు: “ఆ మహిళ లెస్బియన్, కూతురిని వేధించింది”
దీనిపై ప్రధాన ఆరోపణలలో ఉన్న భారతి స్పందిస్తూ సంచలన వాఖ్యాలు చేసింది. ఆ మహిళ లెస్బియన్ అని, తన పదేళ్ల కూతురిని లైంగికంగా వేధించేదని ఆరోపించింది. తాను మానసికంగా ఎంతో వేధింపులకు గురైనట్లు చెప్పిన భారతి, ఈ కారణంగా తన కుమార్తె ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని వెల్లడించింది. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమని, వ్యభిచార గృహం నడిపిన విషయం నిజమే అయినప్పటికీ, ఆ మహిళ క్యారెక్టర్ గురించి తెలిసిన వెంటనే ఇంటి నుంచి పంపించానని పేర్కొంది. పైగా, ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది.
పోలీసుల చర్యలు, దర్యాప్తు
ఇక ఈ కేసుపై కాకినాడ జిల్లా పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు. బుధవారం రాత్రి పెద్దాపురంలో ఉన్న అనేక అనుమానిత వ్యభిచార గృహాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురిని అరెస్టు చేసినట్టు సమాచారం. బాధితులైన కొందరు మహిళలు బయటకు వచ్చి ఆరోపణలు చేయడం, ప్రధాన ఆరోపణలపై నిందితురాలిగా ఉన్న భారతి కౌంటర్ ఆరోపణలు చేయడంతో కేసు మరింత చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం పోలీసుల దృష్టిలో ఈ కేసు చాలా సీరియస్‌గా ఉంది. విచారణ కొనసాగుతోంది. ఇద్దరి మధ్య వాదోపవాదాలతో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.


























