శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రస్తుతం నటించిన సినిమా పెళ్లిసందD. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దర్శక రత్న రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో రోనంకి దర్శకత్వంలో సినిమా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ నెల అక్టోబర్ 15 అంటే దసరా కానుకగా ఈ చిత్రాన్ని థియేటరల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

విడుదలకు సంబంధించి పోస్టర్ ను కూడా విడుదల చేశారు. యూత్‌ఫుల్ లవ్, ఫుల్‌టైమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈచిత్రానికి గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. ఇందులో కథానాయకిగా శ్రీలీలా నటిస్తున్నారు. శ్రీకాంత్ రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘పెళ్లిసందD’కి కొనసాగింపుగా ఈసినిమా సిద్ధమైంది. పెళ్లిసందడి సినిమాలో వచ్చిన పాటలు ఇప్పటికీ వినాలని అనిపిస్తుంటుంది.
అంతటి మధుర వాణీలను సమకూర్చారు కీరవాణి. ప్రస్తుతం ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడు కీరవాణి అందించిన బాణీలు.. ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై చిత్ర యూనిట్ సభ్యులు ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. దానిని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.






























