ప్రజలకు అలర్ట్.. ఫిబ్రవరి నుంచి వారికి రేషన్ లేనట్టేనా..?

0
120

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారు రేషన్ కార్డును కలిగి ఉంటే రేషన్ సరుకులను పొందవచ్చనే సంగతి తెలిసిందే. ప్రతి నెలా రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు రేషన్ డీలర్ ను సంప్రదించి సరుకులను పొందవచ్చు. అయితే ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఈ కేవైసీ చేయించని 64,800 కార్డులను రేషన్ ను నిలిపివేయనున్నారని తెలుస్తోంది. వీరికి సరుకుల సరఫరా తాత్కాలికంగా ఆగనుందని ప్రచారం జరుగుతోంది.

ఈ కేవైసీ పూర్తి కాని కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసిన తరువాతే సరుకులను పొందే అవకాశం ఉంటుందని సమాచారం. అధికారులు గడిచిన మూడు నెలల నుంచి ఈకేవైసీ చేయించుకోవాలని రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సూచనలు చేస్తున్నా ఈకేవైసీ చేయించుకోవడంలో కొందరు లబ్ధిదారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. దీంతో ఈకేవైసీ చేయించుకోని వారికి రేషన్ నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో మొత్తం 8.7 లక్షల కార్డుదారుల్లో 64,800 మంది కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదు. జగన్ సర్కార్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల నుంచి రేషన్ డోర్ డెలివరీ పంపిణీ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేసుకోని వారు గ్రామ, వార్డు వాలంటీర్లను కలవడం లేదా సమీపంలోని గ్రామ, వార్డ్ సచివాలయ అధికారులను సంప్రదించడం ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.

అధికారులే స్వయంగా ఈకేవైసీ చేయించుకోకపోతే సరుకుల పంపిణీ జరగదని చెబుతుండటం గమనార్హం. ఈకేవైసీ చేయించుకోక పోతే కార్డులు రద్దయ్యే అవకాశం కూడా ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here