అధిక రక్తపోటుతో బాధపడేవారు పెసర గింజలతో చెక్ పెట్టొచ్చు..!

0
85

పప్పుధాన్యాలలో పెసరకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. మన శరీరానికి కావలసిన పోషక విలువలు అన్ని పెసరపప్పులో పుష్కలంగా లభిస్తాయి.ఈ పోషక విలువలు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల కోసం పెసరపప్పుకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. కేవలం పెసర పప్పు మాత్రమే కాకుండా, మొలక కట్టిన పెసరు గింజల వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మొలకలు వచ్చిన పెసర గింజలలో ఉండే ఎంజైములు యాంటీఆక్సిడెంట్లు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.పెసర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఉడికించిన పెసర గింజలు అధికమొత్తంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగనిరోధకశక్తి పెంపొందుతుంది. వీటిలో హార్మోన్లు ప్రేరేపించడం వల్ల పిల్లల ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తాయి. ప్రతి రోజు పెసరపప్పును ఏదో ఒక విధంగా మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు.

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఈ పెసరపప్పును ఉపయోగించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే పెసరపప్పును ఉడికించే ముందు కొద్దిగా ఉప్పు కలుపుకొని తీసుకోవటం వల్ల రక్తపోటు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో ఉన్న ఐరన్ శరీరానికి కావలసినంత ఆక్సిజన్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకల దృఢత్వానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విధంగా ప్రతి రోజు పెసర గింజలను తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here