ప్రస్తుత కాలంలో ఒక వస్తువును కొనాలంటే మనం డబ్బులు చెల్లించి కొంటున్నాం కానీ గతంలో వస్తు మార్పిడి విధానం ద్వారా క్రయవిక్రయాలు జరిగేవి. మన దగ్గర ఉన్న వస్తువును అవతలి వ్యక్తులకు ఇచ్చి అవతలి వ్యక్తులు ఇచ్చిన వస్తువులను మనం తీసుకునేవాళ్లం. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా క్రయవిక్రయాలు ఇదే విధంగా జరిగేవి. ఆ తరువాత కాలంలో డబ్బు అందుబాటులోకి రావడంతో డబ్బు చెల్లించి వస్తువులను కొనుగోలు చేస్తున్నాం.

చాలా దేశాలు, కంపెనీలు వాటికి అవసరమైన ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడతాయి. అందుకోసం దేశాలకు అవతలి దేశాల్లోని ఎగుమతి చేసే సంస్థలకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ధనిక దేశాలకు డబ్బులు చెల్లించడం సులువే కానీ పేద దేశాలకు డబ్బులు చెల్లించి దిగుమతి చేసుకోవడం అంత సులభం కాదు. అయితే ఒక దేశం పెప్సీ కూల్ డ్రింక్ కోసం ఏకంగా యుద్ధ నౌకలను అమ్మేసింది.
శీతల పానీయాల కోసం యుద్ధ నౌకలను ఒక దేశం అమ్మిందని చెబితే ఎవరైనా ఘొల్లున నవ్వుతారు. మరికొందరైతే ఆ మాటల్లో నిజం లేదని చెబుతారు. కానీ ఒకప్పటి సోవియట్ యూనియన్(ఉమ్మడి రష్యా) పెప్సీ కూల్ డ్రింక్ కోసం యుద్ధ నౌకలను అమ్మాల్సిన విచిత్ర పరిస్థితి నెలకొంది. 1959 సంవత్సరంలో సోవియట్ సర్కార్ అమెరికాకు టెక్నాలజీని పరిచయం చేసింది. అందుకోసం న్యూయార్క్ లో భారీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది.
ఈ ఎగ్జిబిషన్ తరువాత మాస్కోలో అమెరికా తమ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో సోవియట్ యూనియన్(ఉమ్మడి రష్యా) ఉపాధ్యక్షుడు క్రుషేవ్, అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ఇద్దరి మధ్య పెట్టుబడిదారీ విధానానికి సంబంధించి వివాదం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో పెప్సీను రుచి చూసిన క్రుషేవ్ దిగుమతి చేసుకోవాలని భావించి పెప్సీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సోవియట్ అమెరికాకు పెప్సీ దిగుమతికి బదులుగా వోడ్కాను ఎగుమతి చేసేది.
అయితే 1990లో సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయడం వల్ల అమెరికా సోవియట్ ఉత్పత్తులపై నిషేధం విధించింది.. అయితే సోవియట్ మాత్రం పెప్సీ దిగుమతి చేసుకోవాలని భావించి అందుకు తగిన డబ్బు లేకపోవడంతో యుద్ధనౌకలను పెప్సీకి అమ్మేసింది.






























