సాధారణంగా పెంపుడు జంతువులంటే మనం వాటిని జంతువుల మాదిరిగా కాకుండా ఇంటిలోని సభ్యులుగా భావిస్తాము. ఈ క్రమంలోనే మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వాటిని తీసుకుని వాటిపై ఎంతో ప్రేమను వ్యక్త పరుస్తారు. అదే విశ్వాసంతోనే పెంపుడు జంతువులు కూడా తమ యజమాని పట్ల ఎంతో నమ్మకంగా ఉంటాయి.

ఇలా ఒకరిపై ఒకరు ప్రేమలను చూపించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ మీరు ఎప్పుడైనా కోట్ల విలువ చేసే ఆస్తులను కుక్కలపై రాయించడం విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్లే బాయ్ మోడల్ జు ఐసెన్ అనే మోడల్ తనకు పిల్లలు లేక పోవడంతో ఒక శునకాన్ని పెంచుకున్నారు. ఆ శునకానికి ముద్దుగా ఫ్రాన్సిస్కో అనే పేరు పెట్టింది.
అయితే తనకు పిల్లలు లేక పోవడంతో తన సంపాదించిన ఆస్తి సుమారు 15 కోట్ల ఆస్తిని చట్టప్రకారం లాయర్ ను సంప్రదించి ఆ కుక్కకు చెందేలా వీలునామా రాయించింది. తన తర్వాత తన ఫ్రాన్సిస్కో మరణించే వరకు ఎవరైతే దాని ఆలనాపాలనా చూసుకుంటారో ఆస్తి మొత్తం వారికి దక్కే విధంగా ఈమె వీలునామా రాయించారు.
ఇలా కుక్కపై ఏకంగా 15 కోట్ల ఆస్తి రాయించిన విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఇది చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే జు ఐసెన్ నిత్యం తన ఫ్రాన్సిస్కోతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.
































