అన్నదాతలకు కేంద్రప్రభుత్వం తీపీ కబురును అందించింది. చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను సోమవారం విడుదల చేయనునుంది. ఈ పథకం కింద 9.75 కోట్ల రైతులకు 19,500 కోట్ల రూపాయలు అందనున్నాయి. ప్రధానమంత్రి మోడీ మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను విడుదల చేయనున్నారని ప్రధాని ఆఫీస్ ట్విట్టర్‌లో తెలియజేసింది.

ఏడాదికి 6వేల చొప్పున పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందజేస్తోంది కేంద్రం. ఈ మొత్తాన్ని నాలుగు నెలలకు 2వేల చొప్పున రైతుల ఖాతలో జమా చేస్తున్నారు.































