ప్రధాని మోడీ ఈరోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పకే మూడుసార్లు అయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే లాక్ డౌన్ 3.0 తరువాత ఇప్పటి వరకు ఎటువంటి మెసేజ్ ఇవ్వలేదు ప్రధాని. అయితే మే 17తో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రధాని ఏమి ఆలోచిస్తున్నారు? మరోసారి లాక్ డౌన్ ను పొడిగించనున్నారా? లాక్ డౌన్ 4.0 ఉంటుందా? అనేక అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఉదృతమవుతున్నాయి. ఇప్పటికే డబ్భై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాలలో కొన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం. మరి తాజాగా మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఆర్ధికంగా సంక్షభంలో ఉన్న రాష్ట్రాలకు ఎటువంటి రాయితీలు ఇస్తారు అనే విషయంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటించాలని నిన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి మోదీని కొడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here