దేశంలో ఉన్న ప్రతీ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారిటోరియం కిందనే నడుస్తాయి. ఏ బ్యాంక్ లో అయినా ఏమైనా అవకతవకలు జరిగితే దానికి బాధ్యతగా ఆర్బీఐ ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టే రెపో రేటు, రివర్స్ రెపో రేటు ప్రతీ ఒక్క బ్యాంక్ పాటించాల్సిందే. అయితే ఆర్బీఐ ఆమోదం తెలిపిన కొన్ని బ్యాంకుల్లో ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించారు.

దీంతో ఆ బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న ప్రతీ డిపాజిట్ దారుడికి ఒక సెటిల్ మెంట్ చేసింది. అదేంటంటే.. సెప్టెంబర్ 1 న రానున్న 90 రోజుల్లో డిపాజిటర్లకు రూ.5లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన నవంబర్ 30, 2021 వరకు డిపాజిటర్లు వారి డబ్బును తిరిగి పొందవచ్చు. దీనికి సంబంధించి సర్క్యులర్ కూడా జారీ అయింది.
ఈ 90 రోజుల కాలాల్ని 40 నుంచి 45 రోజులుగా విభజించి .. ఆ బ్యాంకులు మొదటి 45 రోజులు డిపాజిటర్ల రికార్డులను సేకరించి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC)కు అప్పగిస్తాయి. మిగతా 45 రోజులు ఇది ప్రాసెస్ చేస్తుంది. తర్వాత అన్ని వివరాలను సరి చూసి రూ.5 లక్షలు కస్టమర్లకు తిరిగి చెల్లిస్తుంది.
అంతక ముందు ఈ విధానినికి అంటే..పలానా బ్యాంక్ లో ఫ్రాడ్ జరిగినట్లు తెలిస్తే.. ఆ కస్టమర్లకు డబ్బులు చెల్లించడానికి 10 సంవత్సరాలు పట్టేది. కానీ ప్రస్తుతం 45 రోజుల్లో అయిపోతుందని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ మారటోరియంలో నడుస్తున్న బ్యాంకులలో గుణలోని గ్రాహా కో-ఆపరేటివ్ బ్యాంక్, మధ్యప్రదేశ్‌కు చెందిన దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, విజయవాడ, నాసిక్‌లోని ఇండిపెండెన్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పేర్లు ఉన్నాయి.































