Tadpatri Constituency: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చారు. అయితే, పోలింగ్ సమయంలో తలెత్తిన ఘర్షణలు ఇప్పటికి పలు ప్రాంతాలలో కొనసాగుతూనే ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఇలా రెండు వర్గాల మధ్య భారీ స్థాయిలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

గతంలో ఇలా ఎప్పుడు కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ జరిగేది కానీ ఈసారి ఓటమి భయం కారణంగా రెండు పార్టీ నేతలలో భయం మొదలవడంతో పెద్ద ఎత్తున కుట్రలకు దాడులకు తెర లేపారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా జేసి వర్గీయులు అలాగే పెద్దిరెడ్డి వర్గీయుల మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి.
ఇలా ఇరువురి పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున కొట్టుకోవడం కారణంగా పలువురు తీవ్ర గాయాలు పాలయ్యారు అయితే ఈ ఉద్రిక్తత కట్టడి చేయడం కోసం పోలీస్ అధికారులు తాడిపత్రి పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలు చేశారు. అంతేకాకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి జెసి ప్రభాకర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి పెద్దిరెడ్డి..
ఇలా తాడిపత్రి నగరంలో 144 సెక్షన్ అమలులో ఉండడంతో పోలీసులు పెద్ద ఎత్తున పహార కాస్తూ ఉన్నారు దీంతో తాడిపత్రి పట్టణంలో పలు విధులన్నీ చాలా నిర్మానుషంగా కనబడుతున్నాయి. ఎన్నికల రోజు జెసి వర్గీయులు పెద్దిరెడ్డి కార్లపై రాళ్లతో దాడి చేయడంతో మొదలైన ఈ గొడవలు ఇప్పటికీ చల్లారలేదని చెప్పాలి.




























