Avinash Reddy : కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రాఘవరెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. రాఘవరెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

రాఘవరెడ్డిపై నమోదైన కేసు వివరాలు: మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ (తెదేపా) కార్యకర్తలపై హత్యాయత్నం చేశారనే ఆరోపణలపై కేసు నమోదు అయింది. ఈ మేరకు రాఘవరెడ్డిపై C/NO 360/15, U/sec 191(2,), 191(3), 324 (4), 109 r/w 190 BMS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రాఘవరెడ్డి పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.



































