Pooja Hedge: వేణు స్వామిని కలిసి ప్రత్యేక పూజలకు ఏర్పాటు చేసుకున్న పూజా హెగ్డే… కెరియర్ కోసమే పూజలా?

0
72

Pooja Hedge: పూజా హెగ్డే పరిచయం అవసరం లేని పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్ కావడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ కావడం లేదా కొన్ని సినిమాల నుంచి మధ్యలో తప్పుకోవడం వంటివి జరుగుతున్నాయి.

ఈ విధంగా పూజ హెగ్డే సినీ కెరియర్ కాస్త ఇబ్బందులలో ఉందనే చెప్పాలి. అయితే ఈ ఇబ్బందులను అధిగమించడం కోసం ఈమె ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామిని కలిసారని తెలుస్తోంది. వేణు స్వామి సినిమా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అదేవిధంగా మరికొంతమంది హీరోయిన్స్ ఈయన చేత జాతక పరిహార పూజలు కూడా చేయించుకున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి రష్మిక సైతం ఈయన చేత పూజలు చేయించుకొని వరుస అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే పూజా హెగ్డే కెరియర్ కూడా కాస్త ఇబ్బందులలో పడటంతో ఈమె కూడా వేణు స్వామిని సంప్రదించి తన జాతకం చూయించుకున్నారని తెలుస్తోంది.

Pooja Hedge: కెరియర్ కోసం ప్రత్యేక పూజలు…


ఈ క్రమంలోనే తన జాతకంలో దోషాలు ఉండడంతో వాటిని పరిహారం చేయడం కోసం ఈమె పూజకు కావలసిన ఏర్పాట్లు అన్నింటిని కూడా చేసుకున్నారని సమాచారం.అయితే త్వరలోనే ఈమె కూడా వేణు స్వామి చేత పూజలు చేయించుకొని తన సినీ కెరియర్లో సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకుపోతుందని పలువురు పూజా హెగ్డే కెరియర్ గురించి కామెంట్లు చేస్తున్నారు