Poonam Kaur: పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరి కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఈమె హీరోయిన్ గా కన్నా ఎక్కువ వివాదాలతో అందరికీ ఎంతో సుపరిచితం. ఇలా నిత్యం ఏదో ఒక వార్త ద్వారా వార్తల్లో నిలబడే పూనమ్ కవర్ వివాదాలకు అడ్రస్ గా మారిపోయారు.

సినిమా అని మాత్రమే కాకుండా రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఈ విధంగా నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ తాజాగా నటుడు అరవింద్ తో కలిసి “నాతిచరామి” అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. 1:29 సెకండ్ల నిడివిగల ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇందులో పూనమ్ ఎవరికి తెలియకుండా చేసిన హత్యల కారణంగా జైలుపాలైనట్లు తెలుస్తోంది. అలాగే ఈ ట్రైలర్ లో ఈమె బెడ్ రూమ్ సన్నివేశాలలో తెగ రెచ్చిపోయినట్టు చూపించారు.
బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయిన పూనమ్…
ఈ విధంగా బెడ్ రూమ్ సన్నివేశాలలో ఎంతో అరాచకంగా నటిస్తూ రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మకు ఈసారైనా మంచి విజయం అందుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈమె నటించిన ఏ సినిమా కూడా తనకు సరైన బ్రేక్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే పూనమ్ ఇలాంటి సినిమాకి ఒప్పుకుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారింది.





























