ఓటు వేస్తేనే పోర్న్ చూసేందుకు అనుమతి.. ఎక్కడంటే..?

0
115

ప్రపంచ దేశాల్లో ఆయా దేశాలు ఎన్ని కఠిన నిబంధనలు చేసినా యువతలో చాలామంది అశ్లీల వెబ్ సైట్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా 19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు అశ్లీల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారని పలు సర్వేల్లో తేలింది. అయితే ఎన్నికల్లో ఎవరైతే ఓటు వేస్తారో వారికి మాత్రమే పోర్న్ చూసే అవకాశం కల్పిస్తామని.. మిగిలిన వాళ్లు పోర్న్ చూడలేరంటూ పోర్న్‌హబ్ వెబ్‌సైట్ సంచలన ప్రకటన చేసింది.

పోర్న్‌హబ్’ వెబ్‌సైట్ చేసిన ఈ ప్రకటన అమెరికా ప్రజల్లో చర్చనీయాంశమైంది. యువతలో కొందరు ఈ విషయం తెలిసి పోర్న్ కు, ఓటుకు మూడి పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అమెరికా ప్రజలు పోర్న్ హబ్ వెబ్ సైట్ లోకి వెళితే అక్కడ మీరు ఓటు వేశారా..? అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు ఎవరైతే యస్ అని సమాధానం ఇస్తారో వారికి మాత్రమే ఆ సైట్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా నో అని ఎంటర్ చేస్తే మాత్రం వారికి ఆ సైట్ ఓపెన్ కాదు.

‘పోర్న్‌హబ్’ ఉపాధ్యక్షుడు కోరే ప్రైస్ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. గత ఎన్నికల్లో 100 మిలియన్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని.. అంతమంది ఓటుహక్కును వినియోగించుకోలేదంటే ఓటు హక్కు ఉన్న జనాభాలో ఏకంగా 43 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోలేదని అర్థమని వెల్లడించారు.

ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కోరే ప్రైస్ చెబుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రశ్న కనిపిస్తుందని ఓటు వేయకపోయినా వేశామని ఎంటర్ చేసి కూడా సైట్ లోకి ఎంటర్ కావచ్చని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here