రిపబ్లిక్ మూవీ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పోసాని మురళి కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి నీకు ఏ మాత్రం పోలిక లేదంటూ… పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు.

అదేవిధంగా పంజాబీ హీరోయిన్ విషయంలో తనను మోసం చేసిన వాళ్ళని గుర్తించి తనకి న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పోసానిపై జనసేన అభిమానులు పవన్ అభిమానులు ప్రతి నిమిషం నిమిషానికి ఫోన్ చేస్తూ అతనిని తన కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు అంటూ తాజాగా మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ వందలాది బూతు మెసేజ్ లు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆరోపించారు.

పవన్ జగన్ గురించి విమర్శించారు..నేను జగన్ అభిమానిని కావడంతో అతని మాటలను ఖండించాను. పవన్ గతంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి విమర్శించడంతో ఆయనకి కెసిఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక సైకో… ఎవరో ఫంక్షన్ పెట్టుకుంటే అక్కడికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎందుకు వస్తున్నారని ఈ సందర్భంగా పోసాని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అనే సైకో వెధవకి చెబుతున్నా.. నీకు ఒక ఆడపిల్ల ఉంది. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంది అనుభవిస్తావు రక్త కన్నీరు కారుస్తారు నేను బతికి ఉంటా.. దరిద్రపు నా కొడకా.. నా భార్యను అనరాని మాటలు అన్నావు అందుకు నిన్ను ఏమైనా అనొచ్చు అంటూ పోసాని మరొకసారి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.































