Roja: ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలలో భాగంగా కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికలలో 151 సీట్లు గెలుపొందిన వైసిపి ప్రభుత్వం ఓడిపోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు అయితే కొంతమంది మంత్రుల నోటి దూల కారణంగానే పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్లు మొత్తం నటి రోజా అని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఎన్నికలలో భాగంగా జబర్దస్త్ కమెడియన్లు మొత్తం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అలాంటి తరుణంలోనే రోజా వారు ఎంతండి చిన్నప్రాణాలు అంటూ వారి గురించి తేలికగా మాట్లాడారు.
అయితే ఈ విషయాల గురించి జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ ఎన్నికల ఫలితాలకు ముందే ఆమె గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోజా గారు చేసిన తప్పులను వదలరని తప్పు తప్పే అని షకలక శంకర్ వెల్లడించారు. తప్పు ఒకరోజు కాకపోయినా మరో రోజు అయినా బయటకు వస్తుందని ఆయన తెలిపారు. రోజాగారు మనుషులను మరిచిపోయి మాట్లాడటం కరెక్ట్ కాదని, గెలిచినంత మాత్రాన అలా విర్రవీగి మాట్లాడకూడదని తెలిపారు.
ప్రజా శ్రేయస్సు కోసం..
ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్ అని మేము భావిస్తున్నాము ఆయన ఎంతో మంది గొప్పవారు రాసిన పుస్తకాలను చదివారని అదే ఏపీ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగులు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవేనని తెలిపారు. రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం పక్కా అంటూ పవన్ చెప్పిన డైలాగులను ఈయన గుర్తు చేసుకున్నారు. ఆయన ఎప్పుడు ప్రజా శ్రేయస్సు కోసమే పాటుపడతారని షకలక శంకర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























