మెగా స్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్ లాంటి వారు సినిమా ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెరపై కూడా ఉంటారు అని ఆయన బుల్లితెరకి వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. ఆయన ఎవరు అంటే బుల్లితెర మెగాస్టార్ గా పిలువబడిన ప్రభాకర్. ఆయన ఖమ్మం జిల్లా ముదిగొండ లో జన్మించారు ఆయన నటించిన మొదటి సీరియల్ చాణిక్య కానీ ఋతురాగాలు సీరియల్ తో యాక్టర్ గా మంచి గుర్తింపు సాధించాడు మొదటగా తనకి సీరియల్లో నటించడం ఇష్టం లేదు కానీ వాళ్ళ ఫ్రెండ్ తో ఒక రోజు షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా నటించాల్సి వచ్చింది అని ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు.

prabhakar

ఋతురాగాలు తో మంచి గుర్తింపు లభించిన తర్వాత చాలా సంవత్సరాల పాటు సీరియల్స్ లో నటిస్తూ వస్తున్నారు రుతురాగాలు తర్వాత అంతా గుర్తింపు తెచ్చిన సీరియల్ ఏదైనా ఉంది అంటే అది అంతరంగాలు అని చెప్పొచ్చు శరత్ బాబు లీడ్ రోల్ లో చేసిన అంతరంగాలు సీరియల్ లో మంచి క్యారెక్టర్ చేశారు అలాగే మూడుముళ్ల బంధం, అన్న చెల్లెలు, ముద్దుబిడ్డ, వదినమ్మ లాంటి సీరియల్స్ తో బుల్లితెర మెగాస్టార్ అని పిలువబడుతూ ఇప్పటికీ తన హవా కొనసాగిస్తున్నారు. తను చాలా రోజుల పాటు ఈ టీవీ లో సీరియల్స్ చేస్తూ షో లు నిర్వహిస్తూ ఉన్నాడు అలాగే యాహూ, స్టార్ వార్ స్మైల్ రాజా స్మైల్, జగడం, రంగం లాంటి టీవీ షోలు కూడా నిర్వహించారు. చాలా సంవత్సరాల పాటు ఈటీవీ క్రియేటివ్ మేనేజర్ గా మరియు ఈటీవీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా కొనసాగారు. అయితే రామోజీ రావుకి ప్రభాకర్ కి మధ్య కొన్ని గొడవలు జరగడంతో ఈటీవీ నుంచి ప్రభాకర్ ని తీసివేశారు తర్వాత ప్రభాకర్ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా తన లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నారు.

ఇక ప్రభాకర్ కి మెమరబుల్ మూమెంట్స్ ఏవైనా ఉన్నాయంటే అవి తను డిగ్రీ చదువుతున్నప్పుడు మలైక అనే అమ్మాయిని లవ్ చేసేటప్పుడు తన కోసం తిరిగిన రోజులు మాత్రమే తనకు మెమరబుల్ మూమెంట్స్ అంటూ చాలా సార్లు చెప్పారు. అలా ఒక ఆరు సంవత్సరాల పాటు ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి చంద్రహాస్ అనే అబ్బాయి శ్రీవిద్య అనే అమ్మాయి ఉన్నారు. ప్రభాకర్ ప్రస్తుతం చాలా సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు సీరియల్స్ లోనే కాదు వీలైనప్పుడు సినిమాల్లో నటిస్తూ ఉంటారు ఈమధ్య బ్రాండ్ బాబు అనే సినిమాతో డైరెక్టర్ గా కూడా మారారు ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో మళ్లీ సీరియల్స్ లోనే చేస్తున్నారు. అయితే తను సీరియల్స్ లో వేరే అమ్మాయిలతో యాక్టింగ్ చేసినప్పుడు తన భార్య చూస్తే చాలా బాధపడుతుంది అని కూడా చెప్పారు అందుకే తను నటించిన సీరియల్ లో రొమాంటిక్ సీన్స్ ఉన్న రోజు పవర్ కట్ చేయడం అయిన లేకుంటే ఇంట్లో వాళ్ళని సినిమాకి తీసుకువెళ్లడం లాంటివి చేస్తూ తన భార్య అవి చూడకుండా చేస్తాను ఎందుకంటే ఆవిడ ఆరోజు సీరియల్ లో టెలికాస్ట్ అయ్యే రొమాంటిక్ వీడియో చూస్తే బాధ పడుతుందని అలా చేస్తాను అని చెప్పాడు. అయితే తనని బాధ పెట్టడం ప్రభాకర్ కి నచ్చదు అని కూడా చెప్పుకొచ్చాడు. తను బాధ పడకుండా ఉండడానికి సీరియల్స్ లో నటించేటప్పుడు నటీనటుల మధ్య ఏ విధమైన సంబంధం ఉండదని సీరియల్లోనే అలా చూపిస్తారు అని తనకి తెలియడానికి తనతో పాటు తన భార్యను కూడా షూటింగ్ లోకి తీసుకెళ్ళాడు అక్కడ షూటింగ్ లో చూసి షూటింగ్ అంటే ఇంతే ఉంటుందా అని అనుకొని అప్పటి నుంచి సీరియల్స్ చూసి కూడా బాధపడడం లేదు అని చెప్పాడు.

ఇక అప్పట్లో ఒకరితో సంబంధం పెట్టుకున్నట్లు వార్తలు బాగానే వచ్చాయి కానీ తను మాత్రం నమ్మలేదని నేను అంటే తనకు అంత నమ్మకం అని కూడా ప్రభాకర్ చెప్పారు తన నమ్మకాన్ని చూసిన తర్వాత ఆ వ్యక్తితో అనవసరంగా సంబంధం ఎందుకు పెట్టుకున్నాను అని చాలా బాధపడ్డాను అని చెప్పాడు. అందుకే వేరే సంబంధాలు లేకుండా నన్ను నమ్మి వచ్చిన నా భార్యతోనే సంతోషంగా జీవితం గడపాలి అనుకోని బుద్ధి తెచ్చుకుని ఆవిడ తోనే ఉంటున్నానని చెప్పుకువచ్చాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here