రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజుకు రోడ్డు ప్రమాదం..? ఇందులో నిజమెంత..

0
40

రోడ్డు ప్రమాదాలు సీనీ కుటుంబసభ్యులను వదిలిపెట్టడం లేదు. ఇప్ప‌టికే సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్రమాదం జరిగి ఆపుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ ఉలిక్కిపడగా.. ప్రస్తుతం ఇప్పుడు రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజుకి ప్ర‌మాదం జ‌రిగింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అతడి ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.

వివ‌రాలల్లోకి.. వెళితే సోమవారం సాయంత్రం తన ఇంటిలో అనుకోకుండా జారీ పడిపోవడంతో కాలుకు ఫ్యాక్చర్ అయినట్టు కృష్ణంరాజు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన్ని వెంటనే అపోలో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. డాక్టర్లు ఆయన తుంటికి శస్త్ర చికిత్స నిర్వహించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని.. అంతా ఫేక్ అంటూ వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. తర్వలోనే అతడు లండన్ కు వెళ్తున్నారని.. హెల్త్ చెకప్ కోసం అపోలో ఆసుపత్రిలో అతడు చేరినట్లు చెబుతున్నారు. దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మరో వాదన కూడా వినిపిస్తుంది. అదేంటంటే.. అతడు న్యూమోనియాతో బాధపడుతుండగా.. ఆయనకు అపోలోలో చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు రాధేశ్యామ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడంతో ఫేక్ వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. ఏది నమ్మాలో.. ఏది నమ్మోద్దో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం కూడా కొన్ని కారణాల వల్ల సీని ప్రముఖులు కనిపించకపోతే.. అతడు చనిపోయినట్లు కూడా వార్తలు రాశారు. అతడు స్పందించి నేను బతికే ఉన్నాను అని చెప్పే పరిస్థితికి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here