Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి నటుడు ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు ఇండియన్ స్టార్ సెలబ్రిటీలలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.

ఇక ప్రభాస్ సినిమాలలో నటిస్తే కనుక ఒక్కో సినిమాకు సుమారు 150 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని తెలుస్తుంది. ఇలా స్టార్ హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ ఈయన చాలా ఉన్నతంగానే ఉంటారు. అందరితో సరదాగా కలిసిపోయి ఒక సాధారణ వ్యక్తిలా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
ఇక ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు ప్రభాస్ తో ఒకటి రెండు సార్లు మాట్లాడితే చాలు తప్పకుండా ఆయనకు స్నేహితులుగా మారిపోతారు. ఇలా ప్రభాస్ కి ఇండస్ట్రీలో ఇతర భాషలలో కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారనే చెప్పాలి. ఇలా తన స్నేహితులలో ఏ వ్యక్తి అయినా ప్రభాస్ కి విపరీతంగా నచ్చేశారు అంటే వారికి తప్పకుండా ఒక గిఫ్ట్ పంపిస్తారని తెలుస్తుంది.
గిఫ్ట్ గా వాచ్..
ప్రభాస్ కి ఎవరైనా బాగా నచ్చితే వెంటనే వారికి వాచ్ గిఫ్ట్ గా ఇస్తారట. ఇలా ప్రభాస్ నుంచి ఎంతోమంది హీరోలు టెక్నీషియన్లు దర్శకులు తన నుంచి వాచ్లను గిఫ్ట్ గా అందుకున్నారని తెలుస్తోంది. ఈ విధంగా ప్రభాస్ గురించి ఈ వార్త వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

































