Prabhas: సాధారణంగా సెలబ్రిటీలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఎన్నో రకాల కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ స్టార్ హీరోల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ ఈ యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి రామ్ చరణ్, ఎన్టీఆర్ ,అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రానా వంటి హీరోలందరూ కూడా భారీగా యాడ్స్ చేస్తూ పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే చెప్పాలి. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ప్రభాస్ మాత్రం ఇలాంటి కమర్షియల్ యాడ్స్ కి చాలా దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన కూడా ఒక యాడ్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు.
ప్రభాస్ కేవలం ఒకే ఒక్క యాడ్ చేశారని తెలుస్తోంది బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ మహేంద్ర కారుని ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ లో నటించాడు. ఇదే ఈయన మొదటి చివరి యాడ్ అని చెప్పాలి.అయితే ఈ యాడ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Prabhas:రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…
ఇలా ఒక్కో సినిమాకు దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని ప్రభాస్ ఈ యాడ్ చేయడం కోసం ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అన్నది ఇప్పుడు అందరి మదిలో ప్రశ్నార్థకంగా మిగిలింది. అయితే ఈ యాడ్ చేసినందుకు ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది. ఇక అదే సంస్థ ప్రభాస్ తో మరొక ఆడ్ చేయాలని భావించగా ప్రభాస్ మాత్రం చేయడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది అయితే ఈయన వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం చేత ఇలా ఈ యాడ్స్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.































