Prabhas: ప్రభాస్ బాలకృష్ణ టాక్ షో పాల్గొని ఎంతో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ ను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య ప్రభాస్ వృత్తి పరమైన వ్యక్తిగత విషయాలు గురించి కూడా ఈ కార్యక్రమంలో ముచ్చటించారు. ఇక ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ డం తెచ్చిపెట్టిన రాజమౌళి గురించి కూడా బాలకృష్ణ ప్రభాస్ ను ప్రశ్నించారు.

రాజమౌళి సినిమా అంటే సుమారు మూడు నాలుగు సంవత్సరాలు హీరో లాక్ అవడం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే బాలకృష్ణ మాట్లాడుతూ రాజమౌళితో చత్రపతి సినిమా చేసినప్పుడే అతని గురించి తెలిసి ఉంటుంది ఆయన నీకు బుద్ధి లేదా బాహుబలి సినిమాలో చేశావు అని చమత్కరించాడు. ఈ ప్రశ్నకు ప్రభాస్ సమాధానం చెబుతూ..
చత్రపతి సినిమా చేసే సమయంలోనే నాకు రాజమౌళి గురించి తెలిసిపోయింది. ఆయన విషయంలో నాకు అనుభవం ఉంది కానీ బాహుబలి సినిమా చేసే సమయంలో రానాకు తన గురించి తెలియదు. ఈ సినిమాకి మేం ఫైనల్ అయిన తర్వాత తానేంటో రానాకు చెప్పాను. మనవాడు కాస్త ఫుట్ బాల్ ఆడుకుంటాడని రానాకి చెప్పానని ప్రభాస్ తెలిపారు.అయితే ఇలాంటి సినిమాలలో నటించే అవకాశం తరచూ రాదు కనుక తాను బాహుబలి సినిమాలో నటించానని ప్రభాస్ తెలిపారు.

- Prabhas: అందరి ముందు డైలాగ్ చెప్పాలంటే సిగ్గు అనిపించేది…
ఇక చత్రపతి సినిమా షూటింగ్ చేసే సమయంలో నా మొదటి నాలుగు రోజులకే రాజమౌళి గారు అంటే ఏంటో అర్థమైంది. అప్పటినుంచి తనతో చాలా చనువుగా ఉన్నానని తెలిపారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అందరి ముందు డైలాగ్ చెప్పాలంటే కాస్త సిగ్గువేసేది అందుకే జక్కన్నకు ముందే చెప్పి మూకీ యాక్టింగ్ చేశాను అక్కడున్న వాళ్ళందరూ రిహార్సల్స్ అనుకుంటారని జక్కన్నకు చెప్పేవాన్ని. తాను నేనేం చెప్పినా చేసే ఫ్రీడం ఇచ్చారని ఈ సందర్భంగా రాజమౌళి గురించి ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























