Prabhas – Spirit: బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన ఇప్పటికీ రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ K, స్పిరిట్ వంటి చిత్రాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చిత్రంగా స్పిరిట్ అనే సినిమాలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.

అయితే స్పిరిట్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఇదేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త వైరల్ అయింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి వస్తున్న వార్తలపై స్పందించిన నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాలో ప్రభాస్ నటించే పాత్ర పై క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో ప్రభాస్ అందరూ అనుకున్న విధంగానే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని ఆయన ప్రభాస్ పాత్ర పై క్లారిటీ ఇచ్చారు.
మొదటిసారిగా అలాంటి పాత్రలో ప్రభాస్…
ప్రభాస్ ఇప్పటివరకు వివిధ రకాల పాత్రలలో నటించి ప్రేక్షకాదరణ పొందారు. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించలేదు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం వల్ల ఈ సినిమాలో ఆయన పాత్ర ఏవిధంగా ఉండబోతోందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఈనెల 14వ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా విడుదల విషయంలో చిత్రబృందం అయోమయంలో ఉన్నట్లు తెలుస్తోంది.
































