Prabhas -Kriti Sanon: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి గురించి తరచు వార్తలలో నిలుస్తుంటారు. అయితే ఈయన పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించకపోవడంతో తరచూ ఈయన పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గత కొంతకాలంగా ఈయన నటి కృతి సనన్ తోప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రభాస్ ఖండించినప్పటికీ వీరి గురించే వచ్చే వార్తలు మాత్రం ఆగడం లేదు.

ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు వీరి గురించి గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారని ఈయన వెల్లడించారు. అయితే ఈ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని కొట్టి పారేశారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి ఉమైర్ సందు ప్రభాస్,కృతి సనన్ నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
బ్రేకింగ్ న్యూస్: కృతిసనన్, ప్రభాస్ వచ్చే వారం మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. ఇది వారిద్దరికీ చాలా సంతోషకరమైనది’ అంటూ ఈయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఈ క్రమంలోని ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పలువురు నెటిజన్స్ ఈయన చేసిన ట్వీట్ పై స్పందిస్తూ ఇందులో ఏమాత్రం నిజం లేదని అవగాహనకు వచ్చారు.

Prabhas -Kriti Sanon: ఉమైర్ ట్వీట్ ను కొట్టి పారేస్తున్న నెటిజన్స్…
గతంలో ఈయన ఎన్నోసార్లు ఇలాంటి విషయాల గురించి స్పందిస్తూ చివరికి కేసుల వరకు వెళ్లారు. దీంతో ప్రభాస్ కృతి సనన్ విషయం కూడా నిజం కాకపోవచ్చు అని పలువురు భావిస్తున్నారు.ఒకవేళ ఇది కనుక అబద్ధం అయితే ఈయన మరోసారి చిక్కుల్లో పడతారని భావిస్తున్నారు. అలా కాకుండా ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ అభిమానులుఎంతో సంతోషం వ్యక్తం చేస్తారనే చెప్పాలి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
BREAKING NEWS: #KritiSanon & #Prabhas will get engaged next week in Maldives ????????!! So Happy for them.
— Umair Sandhu (@UmairSandu) February 5, 2023































