Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో త్వరలోనే కల్కి సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇలా ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. లేకపోతే ఈయన డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా మరో సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు రాజాసాబ్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ లో ప్రభాస్ పేరు తప్పుగా పడింది. ప్రభాస్ పేరును ఇంగ్లీషులో prabhas అని రాస్తారు కానీ ఈ సినిమా పోస్టర్ లో మాత్రం prabhass అని ఉంది. ఇలా ప్రభాస్ పేరు పక్కన మరొక S జత చేయడంతో బహుశా ప్రభాస్ సినిమాలు సక్సెస్ కావడం కోసమే ఈయన ఇలా పేరు మార్చుకున్నారా లేకపోతే న్యూమరాలజీ ప్రకారం తన పేరు పక్కన మరొక లెటర్ ఉండడం కోసమే ఇలా పేరు మార్చుకున్నారు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సక్సెస్ కోసమేనా…
ఈ విధంగా ప్రభాస్ తన జాతకం గురించి ఇటీవల పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన జాతకం ప్రకారం తన పేరులో మరొక అక్షరం జత చేసుకుంటే కనుక తనకు మంచి అదృష్టం కలిసి వస్తుందని ఎవరైనా చెప్పడంతో ఇలా పేరు మార్చారా అన్న విషయాలు తెలియాల్సి ఉన్నాయి.































