బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టెంట్ .. అంతే కాకుండా ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామ చంద్ర పాపులారిటీ రోజురోజుకు పెరుగుతోంది. బాలీవుడ్‌లోని టాప్ సెలబ్రెటీలు అతడికి అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ చంద్ర అత్యంత ప్రసిద్ధ సింగింగ్ షో, ఇండియన్ ఐడల్ సీజన్ 5 విజేత. దాని కారణంగా అతను ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు.

ఆ పాపులారిటీ ద్వారానే అతడు బిగ్ బాస్ లోకి వెళ్లాడు. ప్రస్తుతం అతడు సెలబ్రిటీలలో, ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో విపరీతమైన క్రేజ్‌ను పొందుతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి కూడా శ్రీరామ చంద్రుడికి తన మద్దతును ప్రకటించారు. ఆమె అతనికి మద్దతు తెలుపుతున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. తనకు, కృష్ణం రాజుకు శ్రీరామ చంద్ర పాటలు అంటే ఎంతో ఇష్టమని శ్యామలా దేవి వీడియోలో చెప్పడం చూడొచ్చు.
బిగ్ బాస్ షోలో అతని ప్రదర్శనను తాము ప్రతీ రోజు మిస్ కాకుండా చూస్తున్నామని.. ఆమె ఆ వీడియోలో తెలిపారు. బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ శ్రీరామ చంద్ర అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు.. అతడికి టైటిల్ పొందే సత్తా ఉందంటూ తెలిపింది. ఈ వీడియోతో ప్రభాస్ అభిమానులంతా శ్రీరామ చంద్రుడికి ఓటు వేసి టైటిల్ విన్నర్‌గా నిలబెడతారా.. ఈ వీడియోకు అంత సీన్ ఉందా అనేది చివర వరకు చూడాలి.
ఏది ఏమైనప్పటికీ, గ్రాండ్ ఫినాలే దగ్గరపడుతున్న కొద్దీ శ్రీరామ చంద్ర ఓటింగ్ శాతం రోజురోజుకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న అనధికారిక పోలింగ్ ప్రకారం శ్రీరామచంద్ర రెండో స్థానంలో ఉండగా, మొదటి స్థానంలో సన్నీ నిలిచారు. అయితే.. బిగ్ బాస్‌లో ఏదైనా జరగవచ్చు. అతని అభిమానులు అతని ఓట్లను పెంచడానికి అన్ని సోషల్ మీడియా పేజీలలో అతనిని ప్రమోట్ చేయడానికి అన్ని విధాలుగా వెళుతున్నారనడంలో సందేహం లేదు. శ్యామలా దేవి వీడియో శ్రీరామ చంద్రుడిని విజేతగా చేస్తుందో లేదో చూద్దాం.

































