యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఎదిగిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఒకవైపు రాధేశ్యామ్, మరొకవైపు సలార్, ఆదిపురుష్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.

నేడు ప్రభాస్ ఫ్యాన్స్ కు రెండు పండుగలు.ఒకటి తమ అభిమాన హీరో పుట్టిన రోజు కాగా మరొకటి ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా టీజర్ ను విడుదల చేశారు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. యువి క్రియేషన్స్ పతాకంపై ఈ సినీమా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.
వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రాధేశ్యామ్ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటుగా తమిళం,మలయాళం, హిందీ కన్నడ భాషల్లో విడుదల కానుంది.సాహో సినిమా తరువాత ప్రభాస్ నటించిన మరొక సినిమా ఇది.
ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు ప్రభాస్ పుట్టినరోజు పండుగ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తమ అభిమాన హీరోకి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు కేజిఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.




























