Prabhas: చరణ్ తో తప్పకుండా సినిమా ఉంటుంది.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!

0
49

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటిస్తున్నటువంటి ప్రాజెక్టు కే సినిమా టైటిల్ తో పాటు గ్లింప్ కూడా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. కామిక్ కాన్ ఈవెంట్లో భాగంగా ఈ సినిమాకు కల్కి 2989 ఏడీ టైటిల్ తో పాటు గ్లింప్ విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందంపాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రభాస్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ తన సినిమాల గురించి మాట్లాడారు అదేవిధంగా దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి కూడా ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడారు.

రాజమౌళి గురించి మాట్లాడుతూ ఇండియాలోనే అత్యంత అద్భుతమైన డైరెక్టర్ రాజమౌళి అని తెలిపారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాకు ఆస్కార్ రావడం ఎంతో గర్వించదగ్గ విషయం ఈ అవార్డుకు జక్కన్న అర్హుడని ప్రభాస్ తెలిపారు. ఇక రాంచరణ్ గురించి కూడా ఈయన మాట్లాడారు.

Prabhas: ప్రభాస్ చరణ్ మల్టీస్టారర్ మూవీ…

రామ్ చరణ్ తనకు మంచి మిత్రుడని తెలిపారు అయితే తప్పకుండా రాంచరణ్ తో తన సినిమా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఇలా చెప్పారు అంటే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అభిమానులు భావిస్తున్నారు.