Prabhu Deva:సినిమా ఇండస్ట్రీలో ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు సంపాదించుకున్నారు కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. ఈయన కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా దర్శకుడిగా నటుడిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త ఒడిదుడుకులు వచ్చాయని చెప్పాలి.

నటి నయనతారతో ప్రేమలో పడిన ప్రభుదేవా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం నయనతారతో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరి లవ్ బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. అనంతరం ఒంటరిగా ఉన్నటువంటి ప్రభుదేవా తీవ్రమైన వెన్ను నొప్పి సమస్యతో బాధపడ్డారు ఈ క్రమంలోని ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ హిమాని వద్ద ఈయన చికిత్స తీసుకున్నారు.ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు.
ఇలా రహస్యంగా రెండో వివాహం చేసుకున్నటువంటి ప్రభుదేవా ఎప్పుడు కూడా తన రెండవ భార్యని ఎవరికీ పరిచయం చేయలేదు. అయితే గత పుట్టినరోజు సందర్భంగా ప్రభుదేవాకు ఈమె శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేయడంతో ప్రభుదేవా రెండో భార్య అందరికీ పరిచయమయ్యారు.అయితే గత రెండు రోజులుగా ఈయన రెండో భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ప్రభుదేవా 50 సంవత్సరాల వయసులో ముచ్చటగా మూడోసారి తండ్రి అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి.

Prabhu Deva: కష్టపడుతూనే ఉన్నాను…
ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన ప్రభుదేవా తాను 50 సంవత్సరాల వయసులో తండ్రి అయ్యానని ఇప్పుడు తన జీవితం పరిపూర్ణమైందంటూ ఈయన తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని తెలియచేశారు. అదేవిధంగా జీవితంలో ఒక్క క్షణం వృధా చేయకుండా కష్టపడుతూనే ఉన్నానని ఇకపై తన ఫ్యామిలీ కోసం కాస్త సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాను అంటూ ఈ సందర్భంగా ప్రభుదేవా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

































